శివుడిగా అక్షయ్ కుమార్ నటించడం ఇది మొదటిసారి కాదు .. గతంలో బాలీవుడ్లో ఓ మై గాడ్ 2 సినిమాలో కూడా పరమశివుడి గా కనిపించాడు .. అయితే ఇప్పుడు సౌత్ స్టైల్ లో శివుడు గెటప్ కొంచెం కొత్తగా ఉంది .. మిగతాదంతా సేమ్ .. కన్నప్ప స్టోరీ ప్రకారం సినిమా క్లైమాక్స్లో పరమశివుడి ఎంట్రీ ఉంటుంది .. కానీ కన్నప్పలో మాత్రం కాస్త ముందు నుంచే శివుడి పాత్రను తెరపైకి తీసుకువస్తున్నారు.
అక్షయ్ కుమార్ లుక్ తో ఈ సినిమా నుంచి రావాల్సిన కీలకమైన ఫస్ట్ లుక్స్ అన్ని దాదాపు బయటకు వచ్చినట్టే .. మిగిలి ఉంది పాన్ ఇండియా హీరో ప్రభాస్ లుక్ మాత్రమే .. ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది .. అయితే రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ప్రభాస్ ను ప్రమోషన్స్ కోసం కీలకంగా ఉపయోగించుకోవాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది .. అందుకే ఆయనకు సంబంధించిన లుక్ ను అలాగే అన్ని రకాల విషయంలో చిత్ర యూనిట్ గోప్యతను పాటిస్తుంది. ఇక మరి కన్నప్ప సినిమాతో మంచు విష్ణు ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
View this post on InstagramA post shared by akshay kumar (@akshaykumar)