సుమ కనకాల ..అందరికీ బాగా సుపరిచితమైనదే ఈ పేరు. మళ్ళీ ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనేలేదు . ప్రముఖ యాంకర్ .. పలు సినిమాలలో కూడా నటించింది. అడపాదడపా పలు రోల్స్ లో కూడా మెప్పించింది . సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమా ఫ్లాప్ అయింది . అసలు జనాలకు నచ్చనే నచ్చలేదు . ఈ సినిమా తర్వాత సుమ కనకాలకి  చాలా ఆఫర్స్ వచ్చాయి . కానీ ఆ సినిమాలను ఓకే చేయలేదు .


కాగా చాలాకాలం తర్వాత మళ్లీ సినిమాలో కనిపించబోతుంది ఈ స్టార్ యాంకర్. ప్రజెంట్ ఈ వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక పాన్ ఇండియా లెవల్ స్టార్ ఏదైతే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడో..అంత రేంజ్ లో క్రేజ్ దక్కించుకుని శభాష్ అనిపించుకున్న ఈ యామకరమ్మ.. ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్గా తెరకెక్కే ప్రాజెక్ట్ లో కీలక రోల్ లో ఫిక్స్ అయింది . ఈ ప్రాజెక్టు వెనక ఆ బడా బడా పెద్ద తలకాయలే ఉన్నాయి .



సినిమాను నిర్మించేది ఆసియన్ సునీల్ కుమార్తె జాన్వి . అంతేకాదు నిర్మాతగా ఇదే తొలి సినిమా . ఈ సినిమాకి ప్రజెంటర్గా వర్క్ చేస్తున్నాడు తెలుగు హీరో రానా దగ్గుబాటి . ఈ సినిమాకు "ప్రేమంటే" అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసేసారు . ఆశ్చర్యమేంటంటే.. ఈ సినిమా పూజా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా కథ బాగుండడంతో సపోర్ట్ చేయడానికి ఈ విధంగా సందీప్ రెడ్డివంగా పూజా కార్యక్రమాలకి హాజరయ్యాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే నిజానికి సుమ 'జయమ్మ పంచాయతీ' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అసలు సినిమాలోనే నటించకూడదు అంటూ ఫిక్స్ అయిందట. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ బాగుండడం ..కామెడీ ఫిలిం గా తెరకెక్కబోతూ ఉండడంతో సుమ కనకాల ప్రధాన పాత్రలో ఈ సినిమాలో కనిపించడానికి ఓకే చేసిందట . ప్రజెంట్ ఇదే వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: