సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు ..సెంటిమెంట్స్ ని నమ్మే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు . మరీ ముఖ్యంగా బడా పాన్ ఇండియా స్టార్స్ అయితే అసలు అలాంటివి పెద్దగా పట్టించుకోరు . సీనియర్ హీరోస్ కూడా చాలా వరకు పట్టించుకోరు.  కానీ సినిమా హిట్ ఫ్లాప్ విషయంలో పెద్దగా పట్టించుకోని నందమూరి హీరో బాలయ్య ఒక సెంటిమెంట్ ని మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతూనే వస్తున్నారట.  ఆ సెంటిమెంట్ కి సంబంధించి స్వయాన బాలకృష్ణ నే ఓపెన్ అప్ అవ్వడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .


ప్రజెంట్ అదే వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. జాతకాలు ..సెంటిమెంట్స్ బాలయ్య ఈ విధంగా నమ్ముతారా ..? అంటూ షాక్ అయిపోతున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య సెంటిమెంట్ కి విరుద్ధంగా ఏ పని చేయరు. అలా చేసి ఓసారి నడుము విరగ కొట్టుకున్నాడు . ఆ విషయాన్ని స్వయాన బాలకృష్ణ నే ఓపెన్ గా చెప్పుకు రావడం హైలెట్ గా మారింది . "నాది మూలా నక్షత్రం. ఆదివారం బ్లాక్ కలర్ వేయకూడదు అంటూ చాలామంది చెప్పారు . కానీ నేను వినలేదు . ఏమవుతుందో చూద్దాం అంటూ ఓసారి అదే విధంగా చేశాను. అది ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరుగుతున్న మూమెంట్ నిర్మాతలలో ఒకరైన బాలసుబ్రమణ్యం గారు ఒకసారి రాకరాక అదే రోజు షూటింగ్ కి వచ్చారు"..



"ఆరోజు ఆదివారం. నేను కూడా ఆ రోజు ఆదివారం కదా చూద్దాం ఏమవుతుంది అని కావాలని నలుపు రంగు షర్ట్ వేసుకొని వెళ్లాను . ఆదివారం ఆ షర్ట్ వద్దు అని మా ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు. నా మైండ్ వద్దు అని చెప్పిన నేను వినలేదు. రాకరాక ఆయన షూటింగ్ కి వస్తే బాలు గారి కళ్ళముందే నేను పడ్డాను .. నా నడుము విరిగింది .. ఆరోజే అర్థమైంది . సెంటిమెంట్స్ ఫాలో అవ్వాలి అని .."చెప్పుకొచ్చారు . ప్రెసెంట్ ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: