ఎప్పుడు లైఫ్ లో ఏది అనుకోకూడదు.. అనుకుంటే అది సాధించాలి ..సాధించకపోతే నిరాశ పడకూడదు ..ఇలాంటివి మనం రెగ్యులర్ గా వింటూ ఉండే డైలాగ్స్ . కానీ ఎప్పటినుంచో ఒక విషయం కోసం ఆశపడితే ఆ పని సక్సెస్ అయినట్లే అయి లాస్ట్ మినిట్ లో  ఫ్లాప్ అయితే .. ఆ బాధ వర్ణతీతం.  అలాంటి బాధని ఇప్పుడు అనుభవిస్తున్నాడు నందమూరి బాలయ్య అంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్  స్టార్ట్ చేస్తున్నారు . మనకు తెలిసిందే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి యావత్ దేశం ఈగర్ గా వెయిట్ చేస్తుంది .



మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలి అని ..అటు తాత వారసత్వాన్ని ఇటి తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అంటూ చాలామంది నందమూరి ఫ్యాన్స్ ఆశపడ్డారు. ఫైనల్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రకటన వచ్చేసింది . అయితే రీసెంట్ గా మాత్రం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ ఉండకపోవచ్చు అంటూ అంటున్నారు జనాలు . దానికి కారణం ప్రశాంత్ వర్మ..  ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించకుండా వేరే స్టార్ హీరోల సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడమే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .



కాగా  ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆశలు పెట్టుకున్న మూమెంట్లో ఇలాంటి ఒక న్యూస్ బయటకు రావడం నిజంగానే నందమూరి ఫ్యాన్స్ కు తీవ్ర తలనొప్పులు తీసుకొస్తుంది. కాగా  రీసెంట్గా రాంచరణ్.. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ హౌస్ట్ చూస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరైన విషయం తెలిసిందే . ఈ క్రమంలోని చరణ్ తో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఎంట్రీ గురించి మాట్లాడారు.  దానిపై చరణ్ తెలివిగా స్పందించి తప్పుకున్నాడు .


వెంటనే మోక్షజ్ఞ డెబ్యూ పై రివర్స్ కౌంటర్ వేశాడు . దీంతో బాలకృష్ణ ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉన్నంటే బాలయ్య కచ్చితంగా ఆన్సర్ ఇచ్చుండే వాడు . బహుశా ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు . కొత్త ముహూర్తం కొత్త డైరెక్టర్ని ఎంపిక చేసుకుంటూ ఉండొచ్చు . అందుకే ఈ టాపిక్ పై ఎక్కువగా స్పందించలేదు అంటున్నారు జనాలు . మొత్తానికి బాలకృష్ణ అటు మింగలేక ఇటుక లేని పరిస్థితి తెచ్చుకున్నాడు అంటూ చాలామంది జనాలు మాట్లాడుతున్నారు . చూడాలి మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ దర్శకుడి డైరెక్షన్లో ఉండబోతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: