మంచు విష్ణు కన్నప్ప మూవీకి సంబంధించి తాజాగా ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తోంది. అదేంటంటే మంచు విష్ణు చేసే ఆయన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ ఆయనది కాదు అని, వేరే నటుడిది కొట్టేసి ఆయన భయపెట్టి ఈ స్టోరీని తెరకెక్కిస్తున్నట్టు తాజాగా ఒక సంచలన వార్త  మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అసలు విషయంలోకి వెళ్తే.. కన్నప్ప మూవీ స్టోరీ మంచు విష్ణుది కాదని, ఈ మూవీ స్టోరీ తనికెళ్ల భరణిది అని తెలుస్తోంది.తనికెళ్ల భరణి నటుడిగా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి తనికెళ్ళ భరణి కన్నప్ప మూవీ స్టోరీని తెరకెక్కించాలని అనుకున్నారట.కానీ ఈ సినిమాని మంచు విష్ణు తెరకెక్కించడం వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా కన్నప్ప మూవీకి సంబంధించి ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మంచు విష్ణు ఈ ప్రెస్ మీట్ లో కన్నప్ప మూవీ మీది కాదని తనికెళ్ల భరణి నుండి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అది నిజమేనా అని ప్రశ్న ఎదురవగా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. అసలు నాకు ఈ సినిమా స్టోరీ ఐడియా ని ఇచ్చిందే తనీకెళ్ళ భరణి గారు.. అయితే నేను ఈ సినిమాని అప్పటినుండే స్టార్ట్ చేశాను. ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్ లో తీద్దాం అనుకున్నాను . అందుకే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే హాలీవుడ్ సినిమా లెవెల్లో కన్నప్ప మూవీ ని తీయాలి అని స్టోరీ బోర్డు రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఓ రోజు తనికెళ్ళ భరణి గారు మా ఇంటికి వచ్చి విష్ణు నేను ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి ఫైట్లు, యుద్ధాలు అని తీసే డైరెక్టర్ ని కాదు. నేను అనుకున్న దాని ప్రకారం ఓ రెండు మూడు కోట్లలో సినిమా చేస్తాను. అంతకంటే ఎక్కువ ఒత్తిడి నేను తీసుకోలేను. 

ఈ సినిమాని ఓ ఆర్ట్ ఫిలిం లాగా తీద్దాం అనుకున్నాను.. కానీ ఇంత ప్రెజర్ నేను తీసుకోలేను. ఈ స్టోరీ మొత్తం నువ్వు తీసుకో అంటూ నాకు ఆయన ఇచ్చేశారు. కానీ ఆయన మాటలకు నేను బాగా హర్ట్ అయ్యాను. ఆ తర్వాత ఈ స్టోరీ చేయడానికి అస్సలు సమయం రాలేదు. శివుడి అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు అన్నట్లు ఈ సినిమా ఇన్ని రోజులకు శివుడి అనుగ్రహం కారణంగా ఇప్పుడు తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయం నుండి ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎంతోమంది బెస్ట్ టెక్నీషియన్లను, నటీనటులను సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాను.అలా ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నా అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.అలాగే తనికెళ్ళ భరణి గారి దగ్గర నుండి నేను ఈ స్టోరీ లాగేసుకున్నాను అనేదాంట్లో ఎలాంటి నిజం లేదు. ఆయనే నాకు ఈ స్టోరీ ఇచ్చేశారు అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చారు.ఇక మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: