టాలీవుడ్‌ యాక్టర్ అక్కినేని నాగచైతన్య సాయిపల్లవి కాంబోలో సినిమా వస్తుందంటే క్రేజ్‌ ఎలా ఉంటుందో తెలిసిందే.ఇప్పటికే లవ్‌ స్టోరీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ స్టార్ యాక్టర్లు ప్రస్తుతం తండేల్‌ లో నటిస్తున్నారు. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం చందూ మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.కాగా ఈ సినిమాతో అక్కినేని నాగ చైతన్య తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. తండేల్ ను తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబందించిన ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టారు మేకర్స్. తమిళ్ లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిచర్స్ రిలీజ్ చేస్తుండగా బాలీవుడ్ లో ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు మేకర్స్. కానీ తమిళ్ రిలీజ్ పట్ల అక్కినేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుక్కారణం తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే దానికి ఒక రోజు ముందు అనగ ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అజిత్ సినిమా అంటే తమిళనాడులో జరిగే హంగామా అంత ఇంత కాదు. ఇదే చై ఫ్యాన్స్ ను కాస్త ఆందోళనకు గురి చేస్తుంది.ఇదిలావుండగా తండేల్‌ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్‌ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: