సాధారణంగా సినిమా షూటింగ్లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు చిత్ర బృందాన్ని మొత్తాన్ని ఇబ్బందులకు కూడా గురి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల వల్ల గాయాల ఫాలోఅవుతూ కూడా ఉంటారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా సెట్ లో అనుకోకుండా ఒక ప్రమాదం జరగడంతో హీరోతో పాటు నిర్మాత గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో నిర్మాత బోణికపూర్ కుమారుడు అయినటువంటి అర్జున్ కపూర్ తో పాటు రకుల్ ప్రీతిసింగ్ భర్తకి కూడా గాయాలు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రాన్ని రకుల్ ప్రీతిసింగ్ భర్త జాకీ భగ్ననినే నిర్మిస్తూ ఉన్నారట. ఈ చిత్రంలో రకుల్ తో పాటు భూమి ఫెడ్నాకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారట. ముంబైలోని ఒక పాత బిల్డింగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుతూ ఉండగా ఒక్కసారిగా సిలింగ్ కూలిపోవడంతో అక్కడ ఘటన జరిగిందట. దీంతో అక్కడున్న వారందరికీ కూడా గాయాలు అయ్యాయని కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ కూడా ఎలాంటి గాయాలు కాలేదని కొంతమేరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.



జనవరి 18న ఈ ప్రమాదం జరగగా కొంతమేరకు ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చిందట. నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వీటి పైన ప్రత్యేక దృష్టి పెట్టలేదని అక్కడ స్థలాన్ని కూడా సరిగ్గా పరిశీలించలేదని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదాలు కాలేదని ప్రస్తుతానికైతే అక్కడ సినిమా షూటింగ్ ఆపివేసినట్లుగా తెలుస్తోంది. అర్జున్ కపూర్ , అలాగే నిర్మాత జాకి కూడా త్వరగా కోలుకోవాలని రకుల్ ప్రీతిసింగ్ అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి ఈ విషయం పైన అభిమానులు ఆందోళన పడుతూ ఉండక రకుల్ ప్రీతిసింగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: