శ్రీ లీల , మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్స్ అంత ఇప్పుడు టాప్ రేంజ్ లోనే ఉన్నారు .. వారి తర్వాత ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు ప్రియాంక మోహన్ .. రీసెంట్ గానే సరిపోదా శనివారంతో మంచి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలో నటిస్తున్నారు .. ఈ మూవీ హిట్ అయితే ఈ అమ్మాడి రేంజ్ మరో స్థాయికి వెళ్లినట్టే. ఇకప్రియాంక మోహన్ తర్వాత మాళవిక మోహనన్ సైతం ఇదే ప్లానింగ్ లో ఉంది .. ప్రజెంట్ ప్రభాస్ హీరోగా రాజా సాబ్ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది .. ఈ సినిమా రిలీజ్ కి ముందే మాళవికకు వరుస అవకాశాలు వస్తున్నాయి ..
ఇక ఇదే సినిమాలో నిధి అగర్వాల్ కూడా మరో హీరోయిన్గా నటిస్తుంది .. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలోను నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. వీరితో పాటు సాయి మంజ్రేకర్ సైతం టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది .. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియా హౌస్ తో పాటు .. కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఓ సినిమాల్లో కూడా నటిస్తుంది. అడివి శేష్ మేజర్ తో వచ్చిన గుర్తింపు .. స్కంద, గనితో గట్టిగా పోయింది ఈ భామకు .. అందుకే ఇప్పుడు గత వైభవం కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యంగ్ బ్యూటీస్‌లో ఎవరు స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తారనేది చూడాలి.