సింహా , లెజెండ్ , అఖండ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఈ ఇద్దరూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారు .. రీసెంట్ గానే అఖండ 2 షూటింగ్ మొదలైంది .. అలాగే వీరసింహారెడ్డి తో డీసెంట్ విజయం ఇచ్చిన గోపీచంద్ మలినేని తో మరో సినిమాకు నటసింహం బాలకృష్ణ ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఫ్యామిలీ హీరో వెంకటేష్ తో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో కూడిన సినిమాలు తీసి విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి .. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. అలాగే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది .. అలాగే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో రాబోయే రోజుల్లో వెంకటేష్ తో 10 సినిమాలు చేస్తానంటూ అనిల్ ప్రామిస్ కూడా చేసేసాడు..
వీరే కాకుండా త్రివిక్రమ్ అంటే ముగ్గురు హీరోలే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ .. ఈ ముగ్గురు హీరోలతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు ఈ దర్శకుడు .. ఇప్పుడు అల్లు అర్జున్ తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు .. ఈ కాంబోలో నాలుగో సినిమా త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు .. అలాగే సుకుమార్ తో కూడా నాలుగో సినిమాను పూర్తి చేశాడు అల్లు అర్జున్ .. వీరితో పాటు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ తో మరోసారి రిపీట్ కానుంది .. రామ్ చరణ్ తో మరోసారి సుకుమార్ బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నారు .. ఇలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ తమకు విజయాలు ఇచ్చిన దర్శకులని మరోసారి రిపీట్ చేస్తూ వరుస విజయాలు అందుకోబోతున్నారు.