( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్  హీరోగా వ‌రుస‌ సినిమాలు షూటింగులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతుంది . అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ కనిపించిన ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది .  ఈ సినిమాలో ఆయన ఒక సైనికుడు పాత్రలో నటిస్తున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది .


ఇక ఇప్పుడిప్పుడే ప్రభాస్ కాళీ గాయం నుంచి కోలుకుంటున్నాడు .. రీసెంట్ గానే రాజా సాబ్‌ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి హను రాఘవపూడి ఫౌజి షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు.  ఇక త్వరలోనే ఫౌజి కొత్త షెడ్యూల్ తమిళనాడులోని మదురై సమీపంలో మొదలు పెట్టబోతున్నారు . ఇక ప్రభాస్ బ్రాహ్మణ అబ్బాయి గా నటించబోతున్నాడని , అలాగే దేవీపురం అగ్రహారం నేపథ్యం లో ఓ కీలకమైన కుటుంబ ఎపిసోడ్ షూటింగ్ చేయనున్నారని .. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంద ని ..


ప్రభాస్ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి డేట్లు ఇవ్వడం తో ఈ వారం లోనే షూటింగ్ మొదలు కానుంది .. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ గా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని కూడా అంటున్నారు .. భారత స్వాతంత్రానికి ముందు జరిగిన యదార్థ ప్రేమ కథ గా చెప్పబడుతున్న ఈ సినిమా లో ప్రభాస్ భారతీయ సైనికుడి పాత్ర లో కనిపించబోతున్నారు .. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .. అలాగే విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: