వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షించే ఎమోషనల్ కథతో పాటు పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ కు ఈ సినిమా మారుపేరుగా నిలిచింది. సంక్రాంతి పండుగ సీజన్ లో ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో బుల్లి రాజు అనే అబ్బాయి చాలా పాపులర్ అయ్యాడు. ఇతని పేరు రేవంత్. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన బీమాల శ్రీనివాసరావు దేవి దంపతుల కుమారుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ అలియాస్ బుల్లి రాజుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో రేవంత్ కు సినిమాలో అవకాశం వచ్చింది.


అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బాల నటుడిగా మంచి గుర్తింపు రావడంతో బుల్లి రాజుకు సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఇక మహేష్ బాబు సినిమాలో కూడా బుల్లి రాజుకు అవకాశం ఇవ్వాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నాడు. రాజమౌళితో మహేష్ బాబు సినిమా అయిన తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి కొత్త సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

ఇక అందులో బుల్లిరాజుకు చాన్స్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నారట. ముఖ్యంగా బుల్లి రాజుతో అనిల్  రావిపూడి చాలా క్లోజ్ గా ఉండేవాడట. షూటింగ్ జరిగేటప్పుడు సమయం దొరికినప్పుడల్లా బుల్లిరాజుతో ఆడుకునేవాడట. ఈ విషయాన్ని స్వయంగా బుల్లి రాజు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. ప్రస్తుతం బుల్లి రాజు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయాడు. ఇతని నటనకు విపరీతంగా అభిమానులు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: