నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వర్షం సినిమాలో తన అద్భుతమైన నటనను చూసిన అనంతరం వరుస పెట్టి సినిమా అవకాశాలను ఇచ్చారు. వర్షం సినిమా తర్వాత ఈ బ్యూటీ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాకుండా అత్యధిక ఇమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో చేరింది. ముఖ్యంగా త్రిష తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించింది. 


బ్యూటీ వయసు 41 సంవత్సరాలు. అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే కొంతమంది హీరోలతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చినప్పటికీ వారిలో త్రిష ఎవరిని వివాహం చేసుకోకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ఈ బ్యూటీ క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. 2025 లోను త్రిష చేతిలో బోలెడన్ని సినిమాలో ఉన్నాయి. 1200 కోట్ల బడ్జెట్  సినిమాలు సైతం త్రిష చేతిలో ఉన్నాయి. చిరంజీవి, సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తోంది.


ఈ సంవత్సరం రాబోతున్న త్రిష మొదటి చిత్రం విడాముయర్చి. అజిత్ నటిస్తున్న ఈ సినిమా తెలుగులో పట్టుదల అనే టైటిల్ తో విడుదలవుతోంది. ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ చేయబోతున్నారు. త్రిష నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇక తెలుగులో త్రిష నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు విశ్వంభర యువి క్రియేషన్స్ సంస్థ 225 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


తగ్ లైఫ్ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా, కమల్ హాసన్ హీరోగా చేస్తున్నారు. ఇందులో త్రిష కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలాగే సూర్య 45వ సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. సూర్య 45వ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో, రామ్ మూవీ 150 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ కాబోతున్నాయి. మొత్తంగా ఈ సినిమాలకి మొత్తం బడ్జెట్ 1200 కోట్లకు పైనే అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: