ఈ మధ్య కాలంలో చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ  హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు ఈ కోవలో అక్కినేని అఖిల్ కూడా చెరబోతున్నాడు. టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగు పెట్టానున్నాడు. గతేడాది నటుడు అక్కినేని నాగ చైతన్య వివాహబంధంలోకి ‍‍అడుగుపెట్టాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహం చేసుకున్నారు. అంతకుముందు చైతు, హీరోయిన్ సమంతాను వివాహం చేసుకుని.. విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక అఖిల్ అక్కినేని ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇ‍చ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు మోగానున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ కి నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అఖిల్ పెళ్లి కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  
అయితే అఖిల పెళ్లి సందడి అంతా హైదరాబాద్ లోనే జరుతుంది అట. అన్నపూర్ణ స్టూడియోస్ యే పెళ్లి వేదిక అవుతుందని అక్కడే వీరిద్దరి వివాహా వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక అఖిల అక్కినేని పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అలాగే సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో కూడా వీరి వివాహానికి రానున్నట్లు తెలుస్తుంది. కాగా గతంలో అఖిల్ కూడా అతని అన్న చైతు లాగే ఓ అమ్మయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అఖిల్ పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: