అయితే ఈ అంశంపై వివాదాస్పద రివ్యూవర్ పూల చొక్కా నవీన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో పుచుక్ పుచుక్ పూలచొక్కా అంటూ తన రివ్యూలతో పాపులర్ అయిన పూలచొక్కా నవీన్ అందరికీ తెలుసు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. దేవర సినిమా అప్పుడు ఆ సినిమా బాలేదని చెప్పించారని తెలిపారు. తప్పుడు రివ్యూ ఇస్తే డబ్బులు ఇస్తామని పీఆర్వో ఆశ చూపించిందని చెప్పడు. పీఆర్వోలు అంటే సినిమా ప్రచారం చేయడం ఒకప్పటి మాట అని అన్నాడు. ఇప్పుడు ఎదుటి వాళ్ల సినిమాని ఎలా తొక్కాలో.. ఏ విధంగా విషం కక్కాలో స్కెచ్‌లు వేయడమే పీఆర్వోల పని అనేట్టుగా ఉంది అని నవీన్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఒక మెగా ఫ్యాన్ ఉన్నారని.. ఆయన దేవర సినిమా అప్పుడు తన దగ్గరకు వెళ్లి దేవర సినిమా నెగిటివ్ రివ్యూ ఇస్తే రూ. 10 వేలు ఇస్తానని ఆఫర్ చేశాడని తెలిపాడు. ఒక పీఆర్వో అతన్ని నా దగ్గరకు పంపించారని నవీన్ బండారం బయటపెట్టాడు. తాను నెగిటివ్ రివ్యూ చెప్పను అని చెప్పాడని.. తాను జెన్యూన్‌గానే రివ్యూ చెప్తానని బాధులిచ్చానని అన్నాడు. బాగున్న సినిమాని బాలేదని చెప్తే తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని నవీన్ చెప్పుకొచ్చాడు. అతను చెప్పినదాన్ని బట్టి చూస్తే.. ఎదుటి వాళ్ల సినిమాని తొక్కడానికి తెరవెనుక పీఆర్ టీంలు ఎన్ని కుట్రలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.