టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరో నారా రోహిత్, మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కాంబోలో వస్తున్న భైరవం సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ హిట్ అయ్యింది.
అయితే రిలీజ్ చేసిన టీజర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ లుక్స్ లో కనిపించారు. ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయింది. టీజర్ మొదలులోనే రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్తుంది. ఆ తర్వాత శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మంచు మనోజ్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్ ఉంటుంది. ఇప్పటికీ అయితే ఈ టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో అజయ్‌, రాజా రవీంద్ర, సంపత్‌ రాజ్‌, సందీప్‌ రాజ్‌, వెన్నెల కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ అదిరిపోవడంతో.. సినిమాపై ప్రేక్షకులను అంచనాలు పెరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: