పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.
 ఇక సోషల్ మీడియాలో విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా తనకి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో ప్రభాస్ చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో డార్లింగ్ సినిమా ప్రమోషన్స్‌కి సంబంధించింది. వాటిలో భాగంగా ఓ ఛానల్‌కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్వూ అది. ఆ వీడియోలో అసలు మీకు ప్రభాస్ అనే పేరు ఎందుకు పెట్టారని యాంకర్ అడిగితే.. దానికి డార్లింగ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. 'నా అమ్మ వాళ్ల సైడ్.. అంటే మదర్ సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు. వాళ్ల పిల్లల పేర్లు.. ప్రభోద్, ప్రగతి, ప్రమోద్, ప్రకాష్, ప్రశాంతి, ప్రవీణ్, ప్రదీప్తి, ప్రకీర్తి, ప్రసీద.. ఇలా నాకే కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటాయి పేర్లు.. ఇలానే ఇటు సైడ్ సిస్టర్స్, పెద్దనాన్న గారి కూతుళ్లు.. అలానే మా ఫ్యామిలీలో చాలా మంది పేర్లు 'ప్ర'తో మొదలవుతాయి. అందరికీ అలా అనుకొని పెట్టారు.. అందుకే నా పేరు ప్రభాస్ అని పెట్టారు' అంటూ డార్లింగ్ చెప్పుకొచ్చాడు. 
ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నాడో చూశారా, వింటేజ్ ప్రభాస్ లుక్కే లుక్కు, వాయిస్ ఎలా ఉందో అప్పుడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే మొత్తానికి ప్రభాస్ పేరు గురించి తెలిసింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: