కపూర్ ఖాన్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు. కరీనా ఫ్యాషన్ శైలికి గుర్తింపు పొందింది. చలనచిత్ర నటనతో పాటు, కపూర్ స్టేజ్ షోలలో కూడా పాల్గొంటుంది. రేడియో షోను నిర్వహిస్తుంది మరియు రెండు స్వీయచరిత్ర జ్ఞాపకాలు మరియు రెండు పోషకాహార మార్గదర్శకాల పుస్తకాలకు సహ రచయితగా సహకరించింది. చెప్పుకుంటూ పోతే ఈ భామ గురించి చాలానే ఉన్నాయి.
అయితే తాజాగా కరీనా కపూర్ భర్త ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇతర ఇండస్ట్రీలకి చెందిన ప్రముఖులు కూడా ఈ దాడిపై స్పందించిన సంగతి తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సైఫ్‌ని ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయలేదు.
అయితే ఈ ఘటన సహా తదనంతర పరిణామాలపై మీడియా ప్రసారం చేస్తున్న కథనాలపై కరీనా కపూర్ మండిపడ్డారు. కరీనా కపూర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ మీడియా ఛానల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ 'ఇకనైనా ఆపేయండి. మీకు అసలు హృదయం ఉందా..? దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అంటూ ' కరీనా కపూర్ పోస్ట్ చేశారు. మళ్లీ కాసేపటికి వెంటనే ఆ పోస్ట్ ని నటి కరీనా కపూర్ డిలీట్ చేసేశారు.