అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. 'డాకు మహారాజ్', 'గేమ్ ఛేంజర్' లాంటి భారీ సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కేవలం రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 161 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి పొంగల్ హిట్ గా నిలిచింది.ఇదిలావుండగా సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలనటుడు రేవంత్‍తో యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలను వారు పంచుకున్నారు మూవీ టీమ్ సభ్యులు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం గా మారాయి.అసలువిషయమేమిటంటే స్కూల్, కాలేజీ సమయం లో చాలా తుంటరి పనులు చేసేవాడినని హీరో వెంకటేష్ అన్నారు. 

అలాగే తప్పును కప్పి పుచ్చుకునేందుకు యాక్టింగ్ చేసేవాడినని తెలిపారు. ఇప్పుడు సినిమాల్లో చేస్తున్న ఈ యాక్టింగ్ మొత్తం స్కూల్, కాలేజీ టైమ్ లోనే నేర్చుకున్నానన్నారు. అప్పట్లో తనకు చదువు సరిగ్గా రాదని, టీచర్స్ కొడతారనే భయంతో అలాచేసేవాడినని చెప్పుకొచ్చారు.ఇక ఈ సందర్బంగా సుమ మీరు బాగా చదువుతారా, సురేష్ బాబు బాగా చదువుతారా అని అడగగా సురేష్ నెంబర్ వన్ స్టూడెంట్ అని సమాధానమిచ్చారు.ఈ క్రమంలో నే సీక్వెల్ ఎప్పుడు అని సుమ అడిగితే.. మళ్లీ సంక్రాంతికి వస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసినట్టు అనిల్ మాట్లాడారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ చేసే వీలు ఎక్కువగా ఉందని అనిల్ రావిపూడి చెప్పారు.ఈ సినిమాకు సీక్వెల్ చేసే స్పేస్ ఉంది. ఇందుకంటే ఇది చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లేట్. దీన్నే వేరే పరిస్థితులతో చేయవచ్చు. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి స్టోరీ అక్కడి నుంచే మొదలుకావొచ్చు. మరో అద్భుతాన్ని క్రియేట్ చేయవచ్చుఅని అనిల్ రావిపూడి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: