టాలీవుడ్ ఇండస్ట్రీ లో జక్కన్న తర్వాత  స్టార్ డైరెక్టర్ గా పేరున్న యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు అనిల్ రావిపూడి మరోమారు తనకు తిరుగులేదని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తో నిరూపించుకున్నారు.ఆయన డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సంక్రాంతి కి బాలయ్య, రాంచరణ్ కు ధీటు గా సినిమాను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఈ మూవీ ప్రస్తుతం దాదాపు 6 రోజుల్లోనే 180 కోట్లు రాబట్టి ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అవుతుంది. అలాగే నార్త్ అమెరికా సైతం దుమ్ము దులుపుతుంది అనడం లో ఆశ్చర్యం లేదు.అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన 'అలవైకుంఠపురము లో' సినిమా బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని సాధించిందన్న సంగతి తెల్సిందే. అయితే అప్పట్లో ఆ మూవీ విడుదలైన 6 రోజుల్లోనే వసూలు చేసిన కలెక్షన్స్ సంచలనం అయితే ప్రస్తుతం 'సంక్రాంతి కీ వస్తున్నాం' సినిమా కలెక్షన్స్ అల్లు అర్జున్ పేరిట ఉన్న రికార్డ్ను సైతం కొల్లగొట్టింది అంటే సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికి కూడా ఫ్యామిలీస్ ఈ మూవీ కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది.ఈ మూవీ లో ప్రధానంగా వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్,మాస్టర్ రేవంత్ చేసిన కామెడీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ముఖ్యంగా వెంకటేష్ కొడుకు పాత్ర లో చేసిన రేవంత్  కామెడీ బాగా వర్కౌట్ అవ్వడంతో  ఫ్యామిలీస్ వరుస క్యూ కడుతున్నారు.అలాగే పాటలు కూడా సినిమాకు మంచి హైలేట్ గా నిలిచాయి.ఈ మూవీ లో ఇంకా మీనాక్షి చౌదరి, సీనియర్ నటుడు నరేష్,సాయి కుమార్,అవసరాల శ్రీనివాస్ మరియు యానిమల్ సినిమా తో పాపులర్ అయినా ఉపేంద్ర లిమాయే ఎవరికి వారు వారి వారి క్యారెక్టర్స్ పండించారు.దీంతో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా హాల్స్ నిండిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: