భారీ అంచనాలతో వచ్చిన 450 కోట్ల బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్. ఎన్నో అంచనాలతో జనవరి 10న విడుదలైంది ఈ మూవీ. అయితే విడుదలైన బెనిఫిట్ షో  తో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత షోస్ చూసిన చాలా మంది సినిమాకి నెగటివ్ టాక్ ఇచ్చారు.. దాంతో గేమ్ చేంజర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.అయితే గేమ్ ఛేంజర్ సినిమా స్టోరీ బాగున్నప్పటికీ చాలామంది కావాలనే గేమ్ చేంజర్ పై కుట్రలు చేశారని, ఈ సినిమా బాలేదని నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ సినిమాని లోకల్ ఛానల్ లో కూడా టెలికాస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది.అలాగే ఈ సినిమాకి సంబంధించి ఎవరైతే కుట్ర చేస్తున్నారో వారిపై గేమ్ చేంజర్ మేకర్స్ యాక్షన్ కూడా తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలా ఎన్నో వివాదాల మధ్య ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం శంకర్ అని,ఆయన డైరెక్షన్ బాగా చేయకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని చాలామంది మెగా అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నారు.. ఇక ఈ విషయం పక్కన పెడితే..గేమ్  ఛేంజర్ సినిమా కథపరంగా ఫ్లాప్ అయినప్పటికీ యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఇరగదీసారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. ఒకటి అప్పన్న పాత్ర అయితే మరొకటి ఐఏఎస్ పాత్ర. ఇక అప్పన్న పాత్రలో రామ్ చరణ్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు.

అయితే మొదట అప్పన్న పాత్రకి శంకర్ చిరంజీవిని తీసుకోవాలి అనుకున్నారట.కానీ చరణ్ మాత్రం నాన్నగారు ఎందుకు.. నేనే ఈ పాత్రను చేయగలను అని చెప్పారట. ఎందుకంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ లో వస్తే మళ్లీ ఎక్కడ ఆచార్య ఫలితం వస్తుందోనని రామ్ చరణ్ భయపడ్డారట.కానీ తండ్రి కొడుకులు నటించకపోయినప్పటికీ ఆచార్య ఫలితమే మళ్ళీ రిపీట్ అయింది అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: