మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.కెరియర్ పరంగా ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో రౌడీ బాయ్స్ అనే చిత్రంలో తన నటనతో గ్లామర్ తో ఒక్కసారిగా సేమ్ సంపాదించుకున్నది అనుపమ. ఆ తర్వాత టీల్లు స్క్వేర్ సినిమాతో మరొకసారి తన గ్రాండ్ సక్సెస్ అందుకున్న అనుపమ ఈ మధ్య మళ్లీ సినిమా అవకాశాలను తగ్గించుకున్నది. అయితే ఈ సినిమా తెలుగులో విజయాన్ని అందుకోవడంతో ఈమెకు ఇతర భాషలలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయట.



అనుపమ లైన్ అప్ చూస్తే టాలీవుడ్ కంటే బాలీవుడ్ , కోలీవుడ్ వంటి భాషలలో ఎక్కువగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో ఈమె పరదా అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే ఒకవేళ ఇది సక్సెస్ అయితేనే అనుపమ కెరియర్ టర్నింగ్ అవుతుందని చెప్పవచ్చు. మాలీవుడ్, కోలీవుడ్లో మూడు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. అయితే ఈ చిత్రాలన్నీ కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ చిత్రాలు సక్సెస్ అయితే ఆయా పరిశ్రమల అనుపమ తన కెరీయర్ని మరింత మలుపు తిప్పుకునే అవకాశం ఉంటుంది.



అయితే వచ్చిన సమస్య ఏమిటంటే ఈ అమ్మడికి టాలీవుడ్ లో సూపర్ హీరోయిన్గా వెలగాలని కోరిక ఉన్నప్పటికీ తెలుగులో తప్ప ఇతర భాషలలో అవకాశాలు వస్తూ ఉన్నాయి. టాలీవుడ్ లో రెండు మూడు చిత్రాలు మినహా మిగిలిన సినిమాలకు చేయడానికి కంటిన్యూ అవ్వలేకపోతుందట. గత ఏడాది టిల్లు స్క్వేర్ సినిమా చేసింది అంతకుముందు ఏడాది ఖాళీగానే ఉన్నదట అనుపమ. అందుకే తెలుగులో అయితే అనుపమ కెరియర్ సినిమాలు చేయకుంటే డేంజర్ జోన్ లో ఉంటుందని అభిమానులు వాపోతున్నారు.. ఒకవేళ ఇలాగే టాలీవుడ్ ని వదిలేస్తే ఈమె కెరియర్ మళ్ళీ రివర్స్ అవుతుందని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అనుపమ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: