బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బీ గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కి ఇండియా వైడ్ గా అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి అమితాబ్ బచ్చన్ కారణంగా ఆ హీరోయిన్ నిజంగానే పిచ్చిదైపోయిందా.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అమితాబ్ బచ్చన్ కారణంగా ఎందుకు పిచ్చిదైంది అనేది ఇప్పుడు చూద్దాం.. సీనియర్ నటి పర్వీన్ బాబి అంటే ఇప్పటి జనరేషన్ కి అస్సలు పరిచయం లేని హీరోయిన్.ఎందుకంటే ఈ హీరోయిన్ 1970లో సినిమాల్లో నటించింది. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఈ హీరోయిన్ అంతగా తెలియకపోవచ్చు. కానీ అమితాబ్ బచ్చన్  ని దేవుడిగా ఆరాధించిన జనరేషన్ వాళ్లకి మాత్రమే ఈ హీరోయిన్ తెలిసి ఉంటుంది.అయితే  ఈ హీరోయిన్ మరణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పర్వీన్ బాబి సినిమాల్లోకి వచ్చాక దూర బంధువైన పాకిస్తానీతో పెళ్లి కుదిరింది.కానీ అప్పట్లో పాకిస్తాన్ ఇండియాకి గొడవలు రావడంతో ఆ పెళ్లి పెటాకులైంది.ఆ తర్వాత డానీ డెంజోంగ్పా తో ప్రేమలో పడి ఇద్దరు ప్రపంచాన్నే మర్చిపోయేలా డేటింగ్ లో ఉన్నారు. అప్పట్లో వీరిద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఉండటం ఇండస్ట్రీలో రచ్చ సృష్టించింది.

ఆ తర్వాత సినిమాల కారణంగా వీళ్ళు కూడా బ్రేకప్ చెప్పుకొని ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత అలియా భట్ తండ్రి మహేష్ భట్ తో పర్వీన్ ప్రేమలో పడింది.అయితే మహేష్ భట్ కి అప్పటికే పెళ్ళై పూజ భట్ కూడా పుట్టినప్పటికీ  పర్వీన్ ని వదులుకోలేకపోయాడు. అలా భార్యకు దూరమై పర్వీన్ తో మూడు సంవత్సరాలు సహజీవనం చేశాడు.అలా మహేష్ భట్ తో సహజయం చేస్తున్న సమయంలోనే పర్వీన్ ఓ రోజు రాత్రి చిత్రవిచిత్రంగా మాట్లాడింది. అమితాబ్ ఫ్యాన్స్ నన్ను చంపడానికి వచ్చారని, అన్నంలో విషం పెట్టారని, పక్కనే ఉన్న శంఖంలో బాంబ్ ఉందని,నన్ను అమితాబ్ ఫ్యాన్స్ కిడ్నాప్ చేయడానికి వస్తున్నారంటూ ఇలా ఎన్నో చిత్ర విచిత్రంగా మతిస్థిమితం లేని దానిలా మాట్లాడేది. అంతేకాదు మహేష్ భట్ ఇంటికి వచ్చేలోపు మంచం కింద దాక్కొని భయం భయంగా చూసేది.అయితే ఈమె మతిస్థిమితం బాగోలేదని తెలుసుకొని సైకియాట్రిస్ట్ కి చూపించి కొద్ది రోజులు బెంగుళూరులో ఉంచినా కూడా బెంగళూరులో ఉండలేక మళ్ళీ ముంబై కి వచ్చేసింది. ఇక ఈమె మతిస్థిమితం బాలేదని ఆమెను గాఢంగా ప్రేమించిన డానీ సమయం దొరికినప్పుడల్లా పర్వీన్ తో ప్రేమగా గడిపేవాడు.

కానీ డానీ వచ్చినప్పుడల్లా పర్వీన్ నిన్ను అమితాబ్ పంపించాడు కదా..నన్ను చంపేయమని నిన్ను పంపించాడు అంటూ మాట్లాడేది.ఆ తర్వాత పర్వీన్ మతిస్థిమితం కోల్పోయిందని తెలుసుకున్న మహేష్ భట్ ఆమెను వదిలేసి భార్యకు దగ్గరయ్యాడు. ఇక అందరూ వదిలేయడంతో ఒంటరిపోయిన పర్వీన్ చివరికి తిండి కూడా తినకుండా ఆరోగ్యం క్షీణించి మరణించింది.ఇక ఆమె మరణించాక కూడా రెండు మూడు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు.ఈమె మరణ వార్త విని మహేష్ భట్ పరుగున వచ్చి ఆమె అంత్యక్రియలు జరిపించాడు. అయితే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ తనని ఎందుకు చంపాలని చూశారని పర్వీన్ ఎందుకు మాట్లాడిందో.. అమితాబ్ తో తనకు ఎందుకు వైరం ఉందో..ఆయన ఫ్యాన్స్ తనని కిడ్నాప్ చేయాలని అనుకున్నారని పర్వీన్ ఎందుకు మాట్లాడిందో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఆమె ఆ భయం లోనే  పిచ్చిదానిలా తయారైందని చాలామంది అంటుంటారు. అలా అప్పట్లో పర్వీన్ మరణానికి అమితాబ్ బచ్చన్ కి మధ్య ఏదో రిలేషన్ ఉందని చాలామంది బాలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: