టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇకపోతే ఈయన మొట్ట మొదటి సారి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు సినిమాలో హీరో గా నటించిన మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈయనకు అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు తెలుగు సినిమాల ద్వారా వచ్చింది.

ఇకపోతే కెరియర్ ప్రారంభంలో సూపర్ సాలిడ్ విజయాలను అందుకున్న ఈయన ఈ మధ్య కాలంలో మాత్రం సరైన  విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఆఖరుగా ఈయన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ నటుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "VD 12" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా నిర్మించబోతున్నట్లు ఈ మూవీ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. కాకపోతే ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ.ని ఈ సంవత్సరం మే 30 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd