తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు . వెంకటేష్ తన కెరీర్ లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల లో నటించి ఎన్నో విజయాలను అందుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇకపోతే విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నాడు అంటే చాలు ప్రేక్షకుల్లో అద్భుతమైన అంచనాలు నెలకొంటూ ఉంటాయి. ఇకపోతే తాజాగా వెంకటేష్ "సంక్రాంతి వస్తున్నాం" అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ మూవీ అద్భుతమైన కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

ఇకపోతే వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం"మూవీ తో ఒక అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలలో వంద కోట్ల షేర్ కలెక్షన్లను అందుకున్న హీరోలలో వెంకటేష్ రెండవ స్థానంలో నిలిచాడు. చిరంజీవి ఇప్పటి వరకు మూడు సినిమాలతో 100 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేయగా , వెంకటేష్ మొదటి సారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 100 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: