తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున ఉంటారు. వీరు నలుగురు ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. కొత్త తరం హీరోలు వచ్చినా కూడా వీరు తమ క్రేజ్ ను అదే స్థాయిలో కంటిన్యూ చేయడంలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న ఈ నలుగురు హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు తాను నటించిన మూడు సినిమాలతో 100 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేశాడు.

చిరంజీవి మొదట ఖైదీ నెంబర్ 150 సినిమాతో 100 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా , ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి సినిమాతో రెండవ సారి , వాల్టేరు వీరయ్య సినిమాతో మూడవ సారి 100 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేశాడు. ఇకపోతే తాజాగా విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేశాడు.  ఇకపోతే తాజాగా బాలయ్య , బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజు అనే సినిమాలో హీరోగా నటించిన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేస్తే వంద కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దానితో బాలయ్య అభిమానులు ఈ సినిమా ఎలాగైనా 100 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టాలి అని ఆశపడుతున్నట్లు , ఆ రికార్డు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: