తాజాగా ఇటీవలే పవిత్ర లోకేష్, నరేష్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ముఖ్యంగా నరేష్ ఎనర్జీని తట్టుకోవడం చాలా కష్టమని పదిమందిలో ఉండే ఎనర్జీ ఆయన ఒక్కరిలో చూశానని తెలిపింది. ఆయనతో తాను ఎప్పుడు పోటీ పడలేనని అలసిపోయి చాలాసార్లు వెనక్కి తిరిగానని తెలిపింది పవిత్ర లోకేష్. నరేష్ మాత్రం అలసిపోడు అంటూ వెల్లడించింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మరొకవైపు నరేష్ కూడా పవిత్ర లోకేష్ పైన పలు వ్యాఖ్యలు చేశారు.. తన జీవితంలోకి పవిత్ర లోకేష్ వచ్చిన తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని తన జీవితానికి ఒక టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరినట్టుగా మారిందని తెలిపారు. అర్థం చేసుకొనే భాగస్వామి ఉంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి జీతమైనా సరే సాఫీగా సాగిపోతుందంటూ తెలిపారు. అటు మొత్తానికి పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు కూడా తమ జీవితానికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. అయితే వీరిద్దరూ మాట్లాడిన విషయాలపై పలువురు నేటిజెన్స్ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో మళ్లీ కలిసి సినిమాలో నటిస్తారేమో చూడాలి.