విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే గతంలో వెంకటేష్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు కాంబో లో రూపొందిన ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలు సాధించి ఉండడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ ,  బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాల కంటే కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల అయిన సినిమాలలో హైయెస్ట్ టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సెల్ అయిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: