ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికే ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి మరికొన్ని నిమిషాలను యాడ్ చేసి ప్రదర్శిస్తున్నారు.

దానితో ఈ మూవీ కలెక్షన్లు మరికొంత పెరిగాయి. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో గేమ్ చెంజర్ సినిమాకు నెగిటివ్ టాక్ రాగా , డాకు మహారాజ్ , సంక్రాంతి వస్తున్నాం సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ప్రస్తుతం లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో లో సెల్ అయిన టికెట్లను బట్టి చూస్తే అల్లు అర్జున్ ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల అయిన గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ సినిమాలకు గట్టి పోటీలు ఇస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.

ఆఖరి 24 గంటల్లో పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో 12.87 కే సేల్ కాగా , డాకు మహారాజ్ మూవీ కి సంబంధించిన 13.02 టికెట్స్ సెల్ అయ్యాయి. గేమ్ చేంజర్ కి సంబంధించిన 8.24 కే టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మాత్రం అద్భుతమైన టికెట్స్ బుక్ మై షో లో సేల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: