రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఆరవ రోజు హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి ..? అందులో తాజాగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

సంక్రాంతికి వస్తున్నాం : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.05 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. దానితో విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.54 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.52 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.44 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది.

దేవర పార్ట్ 1 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.33 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: