ప్రభాస్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు అప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటూ చెప్పడం తప్ప జరగడం అయితే లేదు. ఈయన పెళ్లిపై ఎంతో మంది ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటాడనిఒక నమ్మకం అయితే ఉంది.కానీ ఆ నమ్మకాన్ని కూడా ఆ నిర్మాత వమ్ము చేసేసారు. అంతేకాదు ఆ నిర్మాత ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్న ఆ నిర్మాత ఎవరు ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ తో పాటు ఫౌజి సినిమాలో కూడా చేస్తున్నారు.. అలాగే త్వరలోనే సలార్-2 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.అయితే ఇన్ని షూటింగులు పెట్టుకొని ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారంటే ఎక్కడో కోస్తా అభిమానులకు నమ్మకమైతే ఉండేది. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్విని దత్ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మాత్రం ఈ ఏడాదిలో ప్రభాస్ పెళ్లి జరగడం కష్టమే అని పెదవి విరుస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

మరి ఇంతకీ అశ్విని దత్ ఏం మాట్లాడారు అంటే..ప్రభాస్ గత ఏడాది కల్కి 2898 AD మూవీతో వచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని కూడా చెప్పారు. అయితే ఈ సీక్వెల్ జూన్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది అని జూన్ నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని అశ్వినీ దత్ చెప్పాడు.దీంతో ఓ వైపు మూడు పాన్ ఇండియా సినిమాలు పెట్టుకుని మరో సినిమా కూడా ఈ ఏడాది చేయడం ఏంటి అని చాలామంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.అంతేకాదు ఇలా వరుస సినిమాలు చేస్తే ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటారు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక కల్కి సినిమాలో ఎన్ని గ్రాఫిక్స్ లో విజువల్స్ చూపించారో చెప్పనక్కర్లేదు. ఇక కల్కి 2 మూవీలో కూడా ఆ రేంజ్ లోనే విజువల్స్ ఉండాలి.లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు.అందుకే ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు కష్టపడాల్సి ఉంటుంది.

అలా సినిమా కోసం డేట్ లు ఇచ్చుకుంటూ పోతే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని చాలామంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇక ఈ ఏడాది మూడు పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ తీరిక లేకుండా నటించడంతో ఆయన పెళ్లి ఈ ఏడాది కూడా జరగదు అని మాట్లాడుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని ఎంతో ఫ్యాన్స్ అనుకుంటున్న వేళ అశ్వినీ దత్ జూన్ నుండి కల్కి సీక్వెల్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని పెద్ద బాంబ్ పేల్చారని అంటున్నారు. అంతేకాదు మరి కొంత మందేమో అశ్వినీ దత్ ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ప్రభాస్ ఈ ఏడాది సింపుల్గానైనా పెళ్లి చేసుకుంటారా.. లేక పెళ్లి చేసుకోకుండా మళ్ళీ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తారా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: