కానీ మరి కొంతమంది మాత్రం డైరెక్టర్ల పై ఉన్న గౌరవంతో అలా చెప్పకుండానే సినిమాలల్లో నటిస్తూ ఉంటారు . వన్స్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ హైలెట్ అయింది అంటే మాత్రం ఆ హీరో ఫ్యాన్స్ ఏకీపారేస్తారు. అటు డైరెక్టర్ ని ఇటు హీరోయిన్ ని ట్రోలింగ్ తో అల్లాడించేస్తారు . అయితే అలా జూనియర్ ఎన్టీఆర్ - బన్నీ - రామ్ చరణ్ విషయంలో జరిగింది . అది కూడా ఒకే హీరోయిన్ కారణంగా. దీంతో ఈ హీరోయిన్ ని అప్పట్లో జనాలు బాగా ట్రోల్ చేశారు . ఆమె మరి ఎవరో కాదు "తమన్న". మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది .
ప్రజెంట్ చెప్పుకోతగ్గ అవకాశాలు లేవు. అయితే హీరోయిన్ తమన్నా - రాంచరణ్ తో రచ్చ అనే మూవీలో నటించింది. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ తో "ఊసరవెల్లి".. బన్నీతో "బద్రీనాథ్" సినిమాల్లో కనిపించి మెప్పించింది . అయితే ఈ మూడు సినిమాలు కూడా ఆమెకు మంచి మార్కులు తీసుకొచ్చాయి . మరీ ముఖ్యంగా హీరోల క్యారెక్టర్ కన్నా హీరోయిన్ బాగుంది అన్న ఆ రేంజ్ లో కామెంట్ లు చేపించుకుంది . అంతేనా డాన్స్ విషయంలో ఇరగదీసింది . రచ్చ సినిమాలో "వాన వాన వెల్లువాయే" సాంగ్ లో నడుమును గిరగిరా తిప్పేసింది .
ఊసరవెల్లి సినిమాకు అయితే కర్త - కర్మ - క్రియ అంతా తానై నిల్చుంది . ఇక బద్రీనాథ్ సినిమా గురించి చెప్పాలా..? బద్రీనాథ్ సినిమాలోని పాటలు అన్నిట్లోనూ తమన్నా డాన్స్ ఓ రేంజ్ లో ఇరగదీసింది . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మించిపోయింది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ మూడు సినిమాలలో హీరోయిన్గా నటించిన తమన్నా.. ఆమె పేరుకు మంచి మార్కులు వేయించుకున్న హీరోల ఫ్యాన్ బేస్ ని మాత్రం సాటిస్ఫై చేయలేకపోయాయి ఈ మూవీస్. ఆ హీరోలకి కొన్ని నెగివ్ కామెంట్స్ కూడా దక్కాయి. అప్పట్లో ఈ మూవీస్ పై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు. అయితే ఆ హీరో ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలిసిందే. తమన్నా పరిస్థితి ఎలా ఉందో కూడా మనకు తెలుసు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటాయి అనేది..!?
'