కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు. వీరిద్దరి కాంబోలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే గౌతమ్ చాలా సంవత్సరాల క్రితం ద్రవ నక్షత్రం అనే ఓ సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ హీరో గా నటించాడు.

సినిమా షూటింగ్ పూర్తి అయిన కూడా అనేక కారణాలబ్వల్ల ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. ఇకపోతే తాజాగా గౌతమ్ మీనన్సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా గౌతమ్ మీనన్ "ధ్రువ నక్షత్రం" సినిమా గురించి మాట్లాడుతూ ... ధ్రువ నక్షత్రం సినిమా ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆ సినిమా విడుదలకు సంబంధించి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఎలాగైనా మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. ఇక ధ్రువ నక్షత్రం సినిమా స్టార్ట్ కాక ముందు కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఈ సినిమా కథను చాలా మంది హీరోలకు వివరించాను. చాలా మంది అనేక కారణాల వల్ల ఈ మూవీ కథను రిజెక్ట్ చేశారు.

వారు రిజెక్ట్ చేసినందుకు నేనెప్పుడూ ఫీల్ కాలేదు. ఎందుకు అంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఇకపోతే నేను ఈ సినిమా కథను సూర్య కు కూడా వినిపించాను. సూర్య కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడు. సూర్య ఈ కథను రిజెక్ట్ చేసినందుకు మాత్రం నేను చాలా బాధపడ్డాను అని తాజాగా గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే గౌతమ్ మీనన్ ఓ వైపు దర్శకుడిగా సినిమాలను రూపొందిస్తూనే మరో వైపు అనేక సినిమాలలో నటిస్తూ దర్శకుడిగా , నటుడిగా మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: