ఫ్లాప్ అంటే సినిమాలో కధ బాగాలేదు.. కంటెంట్ బాగాలేదు ..యాక్షన్ సీన్స్ బాగాలేవు ఇలా ఉంటాయి. అయితే ఎవరు ఊహించిన విధంగా మొదటి రోజే 186 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ ఫేక్ కలెక్షన్స్ ప్రచారంలోకి రావడంతో మెగా హీరో రామ్ చరణ్ పరువు గంగలో కలిసిపోయినట్టు అయింది . దీని పట్ల పలువురు స్టార్స్ కూడా పరోక్షకంగా స్పందిస్తూ మెగా హీరోకి కౌంటర్ లు ఇస్తున్నారు . అయితే రామ్ చరణ్ తన కెరీర్ లో కొన్ని కొన్ని సినిమాలను మిస్ చేసుకుని తప్పు చేశాడు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు .
మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఖాతాలో పడాల్సిన మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ప్రభాస్ ఖాతాలో పడ్డాయి . దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి. ప్రభాస్ కెరియర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఛత్రపతి సినిమాలో మొదటిగా హీరోగా రామ్ చరణ్ ని అనుకున్నారట. అయితే అంతకుముందే రాజమౌళితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్న చరణ్ . ఈ సినిమా కథను రిజెక్ట్ చేసారట. అంతేకాదు ఇంత మాస్ ఎలివేషన్స్ పాత్ర తన బాడీకి సూట్ కాదు అంటూ కూడా రాజమౌళి సినిమాలో సున్నితంగా తిరస్కరించారట.
సలార్.. రీసెంట్గా ప్రభాస్ ఖాతాలో పడిన సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్ . ఈ సినిమాను ముందుగా ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కి వివరించారట. సేమ్ మాస్ ఎలివేషన్ పాత్రను అంతగా లైక్ చేయని రాంచరణ్ ఈ మూవీ ని రిజెక్ట్ చేశారట. కల్కి రీసెంట్ కాలంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న కల్కి మూవీ కూడా ముందు రామ్ చరణ్ ఖాతాలోనే పడాల్సింది. అయితే రామ్ చరణ్ కథ విని ఎక్కడో తేడా కొడుతుంది.. ఇలాంటి ఒక కాన్సెప్ట్ జనాలు లైక్ చేస్తారా..? అంటూ రిజెక్ట్ చేశారట. అలా ప్రభాస్ నటించిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నట్లయింది రామ్ చరణ్ . ఈ మూడు సినిమాల్లో ఏ రెండు సినిమాలు రాంచరణ్ ఖాతాలో పడి ఉన్న ఆయన రేంజ్ వేరే లెవెల్ లోకి మారిపోయి ఉండేది అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు..!