టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే మంచి విజయాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంత మంది స్టార్స్ హీరోయిన్స్ స్టేటస్ కి చాలా దగ్గరగా వచ్చి ఉన్నారు. వారు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రియాంక అరుల్ మోహన్ : ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తరపు పరిచయం అయింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపింది. ఇక మళ్ళీ ఈమె ప్రస్తుతం తెలుగులో నటిస్తోంది. కొంత కాలం క్రితమే సరిపోదా శనివారం సినిమాతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓజి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఈ బ్యూటీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

మీనాక్షి చౌదరి : ఈ బ్యూటీ ఇప్పటికే అనేక విజయాలను తెలుగు సినీ పరిశ్రమలో అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలలో ఒకటి , రెండు మూవీలు మంచి విజయాలను సాధిస్తే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

శ్రీ లీల : ఈ బ్యూటీ కి విజయాలు ఎక్కువ లేకపోయినా ఫుల్ క్రేజ్ మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది. ఇక ప్రస్తుతం ఈ నటి చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండు సినిమాలు విజయాలు అందుకున్న ఈమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి అని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: