సినిమా ఇండస్ట్రీ వాళ్ళపై పగ పట్టినట్లు ఒకరి తర్వాత మరొకరిపై ఐటి దాడులు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు ఐటీ అధికారులు. హైదరాబాదులో దూకుడు పెంచేశారు ఐటీ అధికారులు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలే టార్గెట్ గా వారి ఇళ్లలో,ఆఫీసుల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఇంట్లో ఆఫీసులో తనిఖీలు చేశారు. కేవలం ఆయన ఇంట్లో, ఆఫీసులో మాత్రమే కాకుండా దిల్ రాజు బంధువులు, కూతురు,దిల్ రాజు తమ్ముడు ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. అలా 65 బృందాలుగా ఏర్పడిన ఐటి అధికారులు ఏకకాలంలో 8 ప్రాంతాల్లో ఐటి సోదాలు నిర్వహించారు. ఇక రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్,సంక్రాంతికి వస్తున్నాం వంటి రెండు సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే విడుదలయ్యాయి. 

ఇక ఈ రెండు సినిమాలకు దిల్ రాజు ఏకంగా 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక్క గేమ్ ఛేంజర్ మూవీకే 450 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తక్కువ బడ్జెట్ అయినప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ విషయం పక్కన పెడితే దిల్ రాజుతో పాటు గత ఏడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప-2  సినిమాను తెరకెక్కించిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారట ఐటీ అధికారులు.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో భాగస్వాములుగా ఉన్న మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 అలా హైదరాబాదులో ఐటి అధికారులు దూకుడు పెంచి ఏకకాలంలో 8 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించడంతో ప్రస్తుతం ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక గత ఏడాది విడుదలైన పుష్ప టు భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ 2000 కోట్ల కలెక్షన్స్ కి చేరువలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలో మైత్రి మూవీ  మేకర్స్ పై ఐటి అధికారులు పంజా విసరడంతో ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది.. టాలీవుడ్ నిర్మాతలే టార్గెట్ గా ఐటీ సోదాలు ఎందుకు జరుగుతున్నాయి అని చాలామంది టెన్షన్ లో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: