కాగా ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి , అనిమల్ మూవీలు ఎలాంటి హిట్ టాక్ అందుకున్నాయో అందరికీ తెలుసు . త్వరలోనే అనిమల్ పార్క్ అదే విధంగా ప్రభాస్ "స్పిరిట్" అనే మూవీని తెరకెక్కించబోతున్నారు . కాగా స్పిరిట్ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్ అవ్వబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దానికి మెయిన్ కారణం సందీప్ రెడ్డివంగా . డైరెక్షన్ ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాడు అన్న వార్తలు వినిపించడమే.
అంతేకాదు ఈ సినిమాలో తారగాణాన్ని కూడా చాలా పకడ్బందీగా తయారు చేసుకుంటున్నారట . మరి ముఖ్యంగా ప్రభాస్ కి తండ్రి క్యారెక్టర్ లో టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోని చూస్ చేసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ఆయన మరెవరో కాదు "మెగాస్టార్ చిరంజీవి". మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కించాలి అంటూ సందీప్ రెడ్డివంగా ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టారు . అయితే సందీప్ రెడ్డి వంగ ఆ కోరికను ఇలా స్పీరిట్ సినిమాతో తీర్చుకోబోతున్నారట . ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో చూపించబోతున్నారట . హీరోగా ప్రభాస్ క్యారెక్టర్ కి ఎంత హైప్ ఉంటుందో.. హీరో తండ్రిగా చిరంజీవికి కూడా అంతే మంచి పేరు తీసుకొచ్చే సినిమాగా ఈ మూవీ మారబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!