అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విరాట్ కోహ్లీకి అనుష్క శర్మతోనే కాకుండా మరొక హీరోయిన్‌తో కూడా కుటుంబ బంధం ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన మరదలు కూడా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.
ఆమె పేరు రుహాని శర్మ. విరాట్ కోహ్లీ వదిన అవుతారు. రుహాని తన సినీ కెరీర్‌ను తమిళ సినిమాలతో ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో 'చి ల సౌ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. నిజానికి రుహాని మంచి నటి కానీ, ఇంకా ఆమెకు ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదు.
రుహాని 'హిట్', 'డర్టీ హరి', '101 జిల్లాల అందగాడు' వంటి పలు తెలుగు సినిమాల్లో తన నటనా ప్రతిభను చాటుకుంది. ఇటీవల వెంకటేష్ హీరోగా వచ్చిన 'సైంధవ్' సినిమాలోనూ ఆమె కనిపించింది. ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ, రుహాని ఇంకా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది.
అయితే, రుహాని తనకూ విరాట్ కోహ్లీకి ఉన్న అనుబంధం గురించి 'సైంధవ్' సినిమా ప్రమోషన్లలో స్వయంగా వెల్లడించింది. తమ మధ్య సరదాగా ఉండే చనువు గురించి ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రుహాని సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. చూస్తుంటే త్వరలోనే రుహాని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.