కానీ తాజాగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది. కిచ్చా సుదీప్ ఇకపై బిగ్ బాస్ కన్నడకు హోస్ట్‌గా కనిపించరు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్ లో ఆయన పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుత సీజన్ గ్రాండ్ ఫినాలేతో తన బిగ్ బాస్ ప్రయాణం ముగుస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
"11 సీజన్లుగా బిగ్ బాస్‌ను హోస్ట్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. మీ అందరి ప్రేమ, మద్దతుకు నా ధన్యవాదాలు. త్వరలో జరగబోయే గ్రాండ్ ఫినాలే నా చివరి ఎపిసోడ్. ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అందరినీ నా శక్తి మేరకు ఎంటర్టైన్ చేస్తానని ఆశిస్తున్నాను," అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సుదీప్.
అయితే, ఈ సీజన్ మొదట్లోనే సుదీప్ ఈసారి తన చివరి ఛాన్స్ అని హింట్ ఇచ్చారు. "బిగ్ బాస్ కన్నడ సీజన్ 11కు మీరిచ్చిన అద్భుతమైన స్పందనకు థాంక్స్. ఇది ఒక వండర్ఫుల్ 11 ఇయర్ జర్నీ. కానీ, ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవ్వాల్సిన టైమ్ వచ్చింది. బిగ్ బాస్ కన్నడ హోస్ట్‌గా ఇది నా లాస్ట్ సీజన్. నా డెసిషన్‍ను రెస్పెక్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ సీజన్‌ను మెమరబుల్ చేద్దాం. చివరి వరకు నా బెస్ట్ ఇస్తాను," అని ఇంతకుముందు పోస్ట్ చేశారు.
సుదీప్ తర్వాత హోస్ట్ ఎవరు అనే చర్చలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. రిషబ్ శెట్టి, రమేష్ అరవింద్, గణేష్ లాంటి పేర్లు వినిపించాయి. కానీ, అందరికీ షాక్ ఇస్తూ సుదీప్ మరో సీజన్ హోస్ట్‌గా వచ్చారు. కానీ, ఈసారి మాత్రం ఆయన వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జనవరి 26న బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా తన ఇన్‌క్రెడిబుల్ జర్నీకి ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు.