మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే సినిమా రూపొంది ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను అశ్విని దత్ నిర్మించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమా మొదలు కాకముందు అనేక ఆసక్తికరమైన విషయాలు జరిగాయట. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాకు కథ రచయితగా పని చేసిన పరుచూరి గోపాలకృష్ణ ఆ వివరాలను తెలియజేశాడు.

పరుచూరి గోపాలకృష్ణ "ఇంద్ర" సినిమా గురించి మాట్లాడుతూ ... అశ్విని దత్ , చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ మూవీ సెట్ చేశాడు. అందులో భాగంగా గోపాల్ ని చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది వినండి అది నచ్చితే దానితో చిరంజీవితో సినిమా చేయండి అని చెప్పాడు. గోపాల్ ఆ కథను విన్నాడు. కానీ ఆ కథతో చిరంజీవితో సినిమా చేయను అన్నాడు. దానితో నేను ఒక రోజు కలిసి నువ్వు ఎందుకు ఆ కథతో చిరంజీవితో సినిమా చేయను అంటున్నావు అన్నాను. దానితో ఆయన చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఇది వరకే నేను బాలకృష్ణతో సమరసింహారెడ్డి , నరసింహనాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను  ఆ జోనర్ లోనే ఈ సినిమా కథ కూడా ఉంది. ఇక ఇప్పటికే నేను చిరంజీవితో మెకానిక్ అల్లుడు సినిమాతో ఆయనకు ఫ్లాప్ ఇచ్చాను.

మళ్లీ ఒక ఫ్లాప్ నేను ఆయనకు ఇవ్వలేను. సరైన కథతో సినిమా చేస్తాను అన్నాడు. దానితో నేను ... నువ్వు బాలకృష్ణతో ప్యాక్షన్ సినిమా చేశావు ... చిరంజీవితో కాదు. చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా చెయ్యి బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పాను. ఆయన నా మాటలకు కన్విన్స్ అయ్యి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. చివరగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది అని పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: