మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "చిరుత" సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ నడప విడుదల అయిన ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్రప్రసాద్ కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో మొదట రామ్ చరణ్ కాకుండా మరో హిరోను అనుకున్నారట. కానీ ఆయన ఆ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో రాజమౌళి , రామ్ చరణ్ తో ఈ సినిమాను రూపొందించి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు ..? ఎందుకు ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ చాలా సంవత్సరాల క్రితం ఈ సినిమా కథను సూపర్ స్టార్ కృష్ణ గారి కోసం తయారు చేశాడట. కథ మొత్తం తయారు అయిన తర్వాత కృష్ణ గారికి ఈ సినిమా కథను వినిపించగా ఈ సినిమా కథ ఆయనకు పెద్దగా నచ్చలేదట. దానితో ఈ కథతో సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో విజయేంద్ర ప్రసాద్ ఈ కథను పక్కన పెట్టేసాడట. ఇక రాజమౌళికి ఈ కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ పై ఈ కథ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కథతో రామ్ చరణ్ తో సినిమాను రూపొందించాడట. ఇక ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: