టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది ముద్దుగుమ్మలలో కొంత మంది అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకున్న వారు ఉన్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి , ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అద్భుతమైన విజయాలను అందుకునే చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా అలాగే కెరియర్ను అనేక సంవత్సరాలు కొనసాగించింది.

ఇప్పటికీ కూడా ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ఇప్పటికైనా పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్. ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత చందమామ సినిమాతో అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇక అప్పటి నుండి ఈమె అనేక సంవత్సరాలు అదే స్థాయిలో కెరియర్ ను కొనసాగించింది. కొంత కాలం క్రితం ఈమె పెళ్లి చేసుకుని ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం కూడా కాజల్ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. ఆఖరుగా ఈ నటి సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఈ మూవీ మాత్రం ఈ నటికి నిరాశనే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: