నందమూరి నటసింహం బాలయ్య 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు.. ఒకానొక సమయంలో బాలయ్య చేసిన ప్రయోగాలు ఏ స్టార్ హీరో చేయలేని విధంగా ఉంటాయి..ఎలాంటి పాత్ర అయినా బాలయ్య అందులో పరకాయ ప్రవేశం చేసి జీవిస్తారు.. బాలయ్య ఇప్పటివరకు తన కెరీర్ లో 109 చిత్రాలు చేసారు.. అయితే బాలయ్య గతంలో చేసిన సినిమాలలో ఎంతో కొంత వైవిధ్యం కనిపించేది.. కానీ ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాలు ఒకటే రొట్ట కథ, స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా ఉంటుంది.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా భారీ హిట్ అయింది.. ఆ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.. ఆ పాత్రలో ఆయన నటించిన తీరు, పండించిన ఎమోషన్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. గతంలో బాలయ్య, బోయపాటి కాంబొలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాతో బాలయ్య కెరీర్ మారింది..

 అయితే ఆ తరువాత వచ్చిన వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలు రొటీన్ గా అనిపించాయి.. సినిమాలో బాలయ్యకి డ్యూయల్ రోల్ పెట్టడం ఇంటర్వెల్ లో ట్విస్టు పెట్టడం సెకండ్ బాలయ్య ని దించడం లేదంటే ఒకటే పాత్రకు రెండు షేడ్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చూపించడం.. ప్రస్తుతం బాలయ్య సినిమా కథలు ఇలానే వుంటున్నాయి.. దర్శకుల హీరోగా చెప్పుకునే బాలయ్యకి రొటీన్ కథలతో సినిమాలు చేస్తుంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.. బాలయ్య ఎలాంటి పాత్ర అయినా చేయగలరు..రొటీన్ మాస్ మసాలా కథలు మాకొద్దు బాలయ్య సినిమాల నుంచి మరింత కొత్తదనం ఆశిస్తున్నాం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని ఇకనైనా దర్శకులు బాలయ్యతో సరికొత్త  కథలు చేస్తారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: