ఇంతకు ఈమె ఎవరు అనుకుంటున్నారా? తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేసింది . ఎన్టీఆర్ , చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో పాటు కోలీవుడ్లో సూర్యాతోను పలు సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది .. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలను వదిలేసింది .. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సమీరారెడ్డి .. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది .. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సమీరా రెడ్డి .. ఆ తర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో మెప్పించింది. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్‌కు జంటగా అశోక్ సినిమాలో కూడా నటించింది .. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఊహించని విధంగా టాలీవుడ్ నుంచి పక్కకు వెళ్లిపోయింది .. బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలో నటించింది ..
ఇక ఆ తర్వాత చాలా రోజులకు రానా నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది . తర్వాత చాలా కాలానికి బాలీవుడ్ సినిమాలకు కూడా ఈమె గుడ్ బాయ్ చెప్పేసింది .. ఈ ముద్దుగుమ్మ గతంలో కోలీవుడ్ హీరో సూర్యతో కలిసి నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా మంచి విజయం అందుకుంది . ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా మెప్పించింది .. అయితే ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది .. సోషల్ మీడియాలో రీల్స్ , వీడియోలు , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సమీరా. ప్రజెంట్ ఈ సీనియర్ బ్యూటీ కి సంబంధించిన షాకింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఆ ఫోటోలలో సమీరాన్ని చూసి నేటిజనల్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు .. ఏంటి ఇలా మారిపోయింది అంటూ ఆ ఫోటోలను ఒక్కసారిగా వైరల్ చేస్తున్నారు .
View this post on InstagramA post shared by sameera reddy (@reddysameera)