మెగా హీరోలు గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాలను అందుకోలేక పోతున్నారు. చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫ్లాప్ కాగా ఇక ఆయన మేనల్లుడు, పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుణ్ తేజ్ అయితే సక్సెస్ కొట్టక చాలా ఏళ్ళు అవుతోంది. వైష్ణవ తేజ్ ఉప్పెనతో తప్ప మరే సినిమా సక్సెస్ అందుకోలేదు. ఏళ్లు గడిచి రామ్ చరణ్ సోలోగా వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అన్నట్టుగా టాకు వినిపిస్తోంది.
అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా మెగా కుటుంబం ఎక్కడ చూసినా పొలిటికల్ పరంగా సినిమా ఈవెంట్లలో మాట్లాడడమే కాకుండా అందుకు సంబంధించి కొంతమంది నటీనటులు, నిర్మాతలు , ఇతర పార్టీలను ఎద్దేవ చేయడం వంటివి చేస్తున్నారు.. వీటివల్ల కొంతమేరకు వీరి సినిమాల మీద నెగిటివిటీ ముందుగానే సృష్టించేలా కనిపిస్తోందట. అందుకే ఇటీవలే రామ్ చరణ్ సినిమాకు అలాంటి పరిస్థితి ఎదురయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.పొలిటికల్ కి సినిమాలకు ఎలాంటి సంబంధం లేకుండా సినిమా ఈవెంట్లలో మాట్లాడితేనే ఇక మీదట సినిమాలు అందరూ అభిమానులు కూడా చూసేలా కనిపిస్తున్నారు..
ముఖ్యంగా మెగా హీరోలు రాజకీయాలు అల్లు అర్జున్ గురించి సెటైరికల్ గా మాట్లాడడం వల్లే చాలా సినిమాకు నెగిటివ్ మూట కట్టుకుంటున్నారు.. ముఖ్యంగా ఇలా నెగిటివ్ అయిన వారందరి అభిమానులు కూడా ఒక గుంపుగా మారి మెగా హీరోల చిత్రాలకు నెగిటివ్ గానే స్ప్రెడ్ చేస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి, హరిహర వీరమల్లు, చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలు సక్సెస్ అవ్వాలి అంటే సరైన కథ ఉండడమే కాకుండా పొలిటికల్ పరంగా కాకుండా, సినిమా విషయాల గురించి మాట్లాడి అభిమానులను ఆకట్టుకునే విధంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాయని పలువురి సిని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.