తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు ఊహించని సక్సెస్ అందుకుంటున్నాయంటే .. మరో పక్క కొన్ని సినిమాలు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలను నిర్మాతలకు మిగులుస్తున్నాయి . తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా కూడా టాలీవుడ్ లోనే భారీ నష్టాల జాబితాలో చోటు దక్కించుకుంది .. భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది . దీంతో నిర్మాతకు గతంలో ఎప్పుడు లేనంతగా నష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఈ సినిమా నాక్ థియేట్రిక‌ల‌క‌ల్‌ రైట్స్ ద్వారా కొంత ఆదాయం రావడంతో నిర్మాత దిల్ రాజు పూర్తిగా నష్టపోకుండా కొంత తేరుకున్నారు. గేమ్ చేంజ‌ర్‌ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తన బ్యానర్లు 50వ సినిమాగా నిర్మించారు .. కానీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడం భారీ బడ్జెట్ వెనుక ఉన్న అంచనాలను అందుకోకపోవడం కారణంగా ఆర్థిక నష్టాలు తప్పడం లేదు.
 

ప్రెసెంట్ టాలీవుడ్ లోనే దిల్ రాజు కెరియర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన‌ సినిమా కూడా గేమ్ చేంజర్ నిలవబోతుంది .. ఫామ్ కోల్పోయిన శంకర్ తో బిగ్ బడ్జెట్ తో సినిమా చేయటం దిల్ రాజుకి రిస్క్ అనే సంకేతాలు ముందు నుంచే వచ్చినప్పటికీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా బడ్జెట్ పెరుగుతూ పోయింది .. ఇక టాలీవుడ్ లో ఈ తరహా ఫెయిల్యూర్ మొదటిసారి కాదు .. గతంలో కూడా చాలా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.  ఎన్టీఆర్ కథానాయకుడు , లైగ‌ర్ , భోళాలో శంకర్ వంటి సినిమాలు భారీ స్థాయి బడ్జెట్ పెట్టి నిర్మించినప్పటికీ నిర్మాతలకు షాక్‌లు మిగిల్చాయి .. ఈ సినిమాలు ధియేట్రిక‌ల్‌ బిజినెస్ లో కనీసం 40% కూడా రికవరీ చేయలేకపోయాయి .. గేమ్‌ చేంజర్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలు భారీ అంచనాలతో మొదలైనప్పటికీ చివరికి అందరి ఆశలకు భారీ షాక్ ఇచ్చాయి.

 

ప్రధానంగా స్టార్ స్టామినా తో వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్‌, చిరంజీవి ఆచార్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్ కావటం .. అలాగే తెలుగులో బడ్జెట్ ప్లానింగ్ మీద గట్టిగా ఆలోచించాల్సిన సమయం వచ్చినట్టే .. అయితే గేమ్ చేంజర్ నాన్ ధియాట్రికల్ రైట్స్ బలంతో కొంత నష్టాన్ని పూడ్చింది.  అయితే రాబోయే రోజుల్లో కంటెంట్ విషయంలో ఎంత పెద్ద స్టార్ అయిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివే మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయం. టాలీవుడ్ లోనే నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలిన సినిమాలు జాబితా: డబుల్ ఇస్మార్ట్ - 22% రికవరీ ఎన్టీఆర్ కథానాయకుడు - 28% రికవరీ లైగర్ - 31% రికవరీ భోళా శంకర్ - 33% రికవరీ ఆచార్య - 35% రికవరీ రాధే శ్యామ్ - 40% రికవరీ ..ఇదే క్రమంలో గేమ్ చేంజ‌ర్‌ ఈ జాబితాలో పెద్ద నష్టం కాకపోయినా దిల్ రాజు కెరియర్ లోనే అతిపెద్ద ఆర్థిక నష్టంగా మిగిలింది .. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాల కు పాజిటివ్ టాక్ ఎంతో కీలుకమో ఈ జాబితా మరోసారి స్టార్ హీరోలకు గుర్తు చేస్తుంది .. అలాగే గేమ్ చేంజర్‌ను దాదాపు 400 కోట్ల బడ్జెట్తో నిర్మించుగా ఈ సినిమా థియేట్రిక‌ల్‌గా ఇప్పటివరకు 200 కోట్లు మార్కును టచ్ చేయలేదు .. ఈ లెక్కన ఫుల్ రన్‌లో ఎంతవరకు ఈ సినిమా వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: