అల్లు అర్జున్ ఇప్పటివరకు మూడు సినిమాలతో 100 కోట్ల క్లబ్లో ఉన్నారు .. అలా వైకుంఠపురంలో, పుష్పవన్ , పుష్ప 2 సినిమాలతో టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో మరింత క్రేజీని పెంచుకున్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా ఈ సంక్రాంతికి వచ్చి 100 కోట్ల క్లబ్లో చేరింది .. ఆయన కెరియర్ లో మరో 100 కోట్ల సినిమాగా వచ్చి నిలిచింది. రంగస్థలం , త్రిబుల్ ఆర్ వంటి సినిమాతో ఇప్పటికే ఈ క్లబ్లో చేరాడు రామ్ చరణ్.. ఇప్పుడు ఈ సినిమాతో తన మార్కెట్ను మరింత పెంచుకున్నాడు .. అయితే మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయిన ఈ సినిమా ఓపెనింగ్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన హీరోల విషయానికొస్తే ప్రభాస్ ఆయన కెరీర్లో ఇప్పటివరకు 6 సినిమాలతో 100 కోట్ల క్లబ్లో ఉన్నారు .. బాహుబలి సినిమాలతో పాటు కల్కి , సలార్ సాహో , అదిపురుష్ ..
అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఐదు సినిమాల తో ఈ క్లబ్లో ఉన్నారు .. భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , గుంటూరు కారం , సర్కారు వారి పాట వంటి సినిమాలతో మహేష్ బాబు కూడా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు సినిమాతో 100 కోట్ల క్లబ్లో ఉన్నాడు .. మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ కూడా రెండు హిల్‌లతో ఈ క్లబ్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా మెప్పించింది .. 100 కోట్ల క్లబ్లో నిలిచింది .. ఇది వెంకటేష్ కెరియర్ లోని తొలి 100 కోట్ల షేర్ సాధించిన సినిమా కావటం విశేషం .. ఇక ఈ సినిమా వెంకీ మామ స్టార్ డమ్‌ను మరో రేంజ్ కు తీసుకువెళ్లింది.
ఇక యంగ్ హీరోల్లో 100 కోట్ల షేర్ సాధించిన హీరోలు లిస్ట్ ఇదే :
1. ప్రభాస్ - 6 - బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి 2898AD, సాహో, ఆదిపురుష్ 2. మహేష్ బాబు - 5 - భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం 3. అల్లు అర్జున్ - 3 - అల వైకుంఠపురములో, పుష్ప 1, పుష్ప 2 4. చిరంజీవి - 3 - ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య 5. రామ్ చరణ్ - 3 - రంగస్థలం, RRR, గేమ్ ఛేంజర్ 6. ఎన్టీఆర్ - 2 - RRR, దేవర 7. వెంకటేష్ - 1 - సంక్రాంతికి వస్తున్నాం 8. తేజ సజ్జా - 1 - హనుమాన్