మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి మెగాస్టార్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.ఈయన సినీ కెరియర్ ఒక అన్ స్టాపబుల్ అని చెప్పుకోవచ్చు. ఆయన సినీ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన లైఫ్ ఇండస్ట్రీలో చాలా స్పెషల్ గా సాగింది అని చెప్పుకోవచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దం పాటు తిరుగులేని హీరోగా పేరు తెచ్చుకున్నారు.అందుకే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారు.అయితే అలాంటి చిరంజీవి హిట్ సినిమాకి ఏపీలో రైతుల ఆత్మహత్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చిరంజీవి నటించిన సినిమాల్లో యముడికి మొగుడు సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధా, విజయశాంతిలు హీరోయిన్స్ గా చేశారు. అలాగే యముడు పాత్రలో కైకాల సత్యనారాయణ అద్భుతంగా నటించారు.రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన యముడికి మొగుడు సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో నటించారు. అలాగే ఈ సినిమాలో యముడిగా కైకాల సత్యనారాయణ చేస్తే ఆయన దగ్గర చిత్రగుప్తుడిగా చిరంజీవి మామ అల్లు రామలింగయ్య నటించారు.అలా 1988లో విడుదలైన చిరంజీవి యముడికి మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అంతే కాదు ఈ సినిమాలోని చిరంజీవి డైలాగులకు అప్పటి యూత్ చాలా ఫిదా అయ్యారు. అలా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా చాలా సెంటర్లలో వంద రోజులు కూడా ఆడింది. ఇక చివరికి యముడికి మొగుడు సినిమాకి శత దినోత్సవ వేడుక ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేశారు.అయితే ఆ ఈవెంట్ జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని పత్తి రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనే విషయం చిరంజీవి దగ్గరికి రావడంతో ఈ విషయం వినగానే ఆయన చలించిపోయారట. వెంటనే ఎవరైతే పత్తి రైతులు ఆత్మహత్య చేసుకొని మరణించారో ఆ రైతుల కుటుంబాలకు చిరంజీవి ఆర్థికంగా సహాయం అందించారట. అలా చిరంజీవి గొప్ప మనసుకి అప్పట్లో చాలామంది మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: