టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతికి మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు.. వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి నట‌సింహం, బాబి కాంబినేషన్‌లో తెరకెక్కిన డాకు మహారాజ్‌ సినిమాతో పాటు.. విక్టరీ వెంకటేష్, సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి.


ఈ మూడు సినిమాలలో గేమ్ ఛేంజర్ దాదాపు డిజాస్టర్ కాగా.. డాకు మహారాజ్ హిట్ సినిమాగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ రెండు సినిమాలను దాటుకుని బాక్సాఫీస్ దగ్గర వ‌సూళ్లు లెక్క‌లు వేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్లు కొల్లగొట్టిన సంక్రాంతి వస్తున్నాం సినిమా.. వీక్ డేస్ అయిన సోమవారంలో కూడా హౌస్ ఫుల్ కనిపిస్తోంది. మంగళవారం ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఐదో రోజు 12.75 కోట్ల వసూలు చేసింది.


ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలలో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. మొదటి స్థానంలో త్రిబుల్‌ఆర్ రూ.13.63 కోట్లు ఉండగా.. రెండో స్థానంలో సంక్రాంతి వస్తున్నాం రూ.12.75 కోట్లు, మూడవ‌ స్థానంలో అల వైకుంఠపురం రూ.11.43 కోట్లు, నాలుగవ‌ స్థానంలో బాహుబలి రూ.  11.35 కోట్లు ఐదో స్థానంలో రూ. 10.86 కోట్ల తో ప్రభాస్ కల్కి సినిమా ఉంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అక్కడ రికార్డు స్థాయిలో వసూలు సాధించిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: