అయితే వివాహమై ఏడాది కాకుండానే కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ప్రెగ్నెంట్ అయ్యిందనే విషయాన్ని తెలియజేశారు. తన భార్యతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అన్నట్టుగా తెలియజేశారు కిరణ్ అబ్బవరం. ఈ విషయం తెలిసిన అభిమానులు సిని ప్రముఖులు సైతం కిరణ్ ,రహస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వీరిద్దరూ కలిసి మొదటిసారి రాజా వారు రాణి గారు అనే చిత్రంలో నటించడం జరిగింది. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగిందట.
అలా సుమారుగా ఐదేళ్లపాటు ప్రేమించుకుని గత ఏడాది ఆగస్టు 22న వీరి వివాహం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం సొంత ఊరులో చాలా గ్రాండ్గా రిసెప్షన్ సైతం ఏర్పాటు చేయగా సెలబ్రిటీలు కూడా రావడం జరిగింది. 'క' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదటిసారి ఈ జంట అభిమానుల ముందుకు వచ్చారు. రహస్య తన లక్కీ ఛాయని కూడా చెప్పుకోవడం జరిగింది కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ తన భార్య రహస్య మాత్రం సినిమాలలో నటించలేదు. సోషల్ మీడియాలో కుటుంబానికి సంబంధించి పోస్టులను మాత్రం షేర్ చేస్తూ ఉంటుంది. కా సినిమాతో మొదటిసారి 50 కోట్ల గ్రాస్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. తన తదుపరిచిత్రం దిల్ రుభా వచ్చే నెల 14వ తేదీన రిలీజ్ కాబోతోంది.