ఇండియాలో ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ డామినేషన్ కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ అవుతున్న పని చేస్తున్న వాళ్ళు ఎక్కువగా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ రచ్చ పుష్ప 2 వరకు కొనసాగింది .. ఇకపై కూడా కొనసాగుతుంది. బాహుబలి - బాహుబలి 2 - కల్కి - హనుమాన్ - కార్తికేయ 2 లాంటి తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్నాయి. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలుగా గతంలో బాలీవుడ్ హీరోల పేర్లు వినిపించేవి. ఇప్పుడు ఆ ప్లేస్ ని కూడా టాలీవుడ్ హీరో లు కబ్జా చేస్తున్నారు. తాజాగా ఓర్మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ నెల కు సంబంధించి ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోల జాబితా రిలీజ్ చేసింది. టాప్ టెన్ పాపులర్ హీరోల లిస్ట్ విడుదల చేశారు. ఇందులో కంప్లీట్ గా టాలీవుడ్ హీరో ల డామినేషన్ కనిపిస్తుంది. టాప్ టెన్ లో ఐదుగురు తెలుగు హీరోలే ఉన్నారు.
మిగిలిన వారి లో ముగ్గురు బాలీవుడ్ నుంచి .. ఇద్దరు కోలీవుడ్ నుంచి ఉన్నారు. అగ్రస్థానం కూడా టాలీవుడ్ హీరోకే దక్కింది. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ పాపులర్ హీరోగా నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రెండో స్థానం దక్కింది. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో తమిళ హీరో దళపతి విజయ్ ... నాలుగో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ... ఐదవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ... ఆరవ స్థానంలో తమిళ హీరో అజిత్ కుమార్ ... ఏడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఎనిమిదో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. చివరి రెండు స్థానాలలో మాత్రం బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ - అక్షయ్ కుమార్ ఉన్నారు.